Cincinnati Open : వింబుల్డన్ రన్నరప్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో టైటిల్ సాధించాడు. సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open)లో ఛాంపియన్‌గా నిలిచి ఈ ఏడాది ఆరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ సీడ్ జన్నిక్ సినర్ (Jannik Sinner) అనూహ్యంగా నిష్క్రమించడంతో విజేతగా నిలిచాడీ స్పెయిన్ స్టార్. ఉత్కంఠగా సాగుతుందునుకున్న టైటిల్ పోరులో సినర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆట మొదలైన 23 నిమిషాలకే టాప్ సీడ్ ప్లేయర్ ఇబ్బంది పడ్డాడు. ఇక ఆడడం నా వల్ల కాదంటూ వైదొలిగాడు. దాంతో, నిర్వాహకులు అల్కరాజ్ను విజేతగా ప్రకటించారు. అలా.. మొదటిసారి సిన్సినాటి ఓపెన్ ట్రోఫీని పట్టేశాడీ రెండో ర్యాంకర్.
ఈమధ్యే వింబుల్డన్ ఫైనల్లో సినర్, అల్కరాజ్ హోరాహోరీగా తలపడిన తీరు చూశాం. సిన్సినాటి ఓపెన్ ట్రోఫీ వేటలోనూ ఇద్దరూ ‘నువ్వానేనా’ అన్నట్టు పోరాడతారని ఆశించారంతా. కానీ, సమఉజ్జీల పోరులో అల్కరాజ్ ధాటికి సినర్ తేలిపోయాడు. తొలి సెట్లో స్పెయిన్ సంచలనం దూకుడుగా ఆడి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
I’m so sorry for Jannik! Nobody likes to win because their opponent retires, especially in a final like this. Wishing you a speedy recovery! ❤️ Very happy with my week in Cincinnati and feeling ready for the US Open! 💪🏻🏆
📸 @CincyTennis pic.twitter.com/wEHPT1PBOH
— Carlos Alcaraz (@carlosalcaraz) August 18, 2025
అల్కరాస్ 0-5తో ఆధిక్యంలో ఉండగా.. సినర్‌కు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. ఇక ఆట కొనసాగించడం తన వల్ల కాదని చెప్పడంతో అల్కరాజ్ విజేతగా నిలిచాడు. గత సీజన్లో విజేత అయిన సినర్ అనూహ్యంగా ఫైనల్‌కు దూరమైనందుకు అభిమానులకు సారీ చెప్పాడు. మిమ్మల్ని నిరాశ పరిచినందుకు నన్ను క్షమించండి అని గ్యాలరీలోని వాళ్లను ఉద్దేశించి మాట్లాడిన సినర్ నిరాశగా కోర్టును వీడాడు.