లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెగాఫైట్కు రంగం సిద్ధమైంది. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్, సెర్బియా దిగ్గజం నోవాక్ జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి వింబుల్డన్ విజేతగా నిలువాలని జొకో పట్టుదలతో ఉంటే..తన టైటిల్ నిలబెట్టుకునేందుకు అల్కారజ్ సర్వశక్తుల ఒడ్డే అవకాశముంది.
జొకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కల నెరువేరుతుందా లేక అల్కారజ్ ఖాతాలో రెండో వింబుల్డన్ ట్రోఫీ చేరుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.