IND vs AUS : డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 26 ఓవర్లకు కుదించిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేలో ఓవర్లో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా అతడు ఆడిన బంతిని రోహిత్ శర్మ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో. 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం కెప్టెన్ మిచెల్ మార్ష్(32 నాటౌట్), జోష్ ఫిలిప్పె(5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్.. ఇంకా కంగారూల విజయానికి 76 పరుగులు కావాలి.
పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 136 రన్స్ చేయగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131గా నిర్ణించారు. స్వల్ప ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. రెండో ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను (8) ఔట్ చేశాడు.
Runs with the bat 🔢
And now making an impact with the ball ☝Axar Patel opens his wicket-taking account 👏
Rohit Sharma takes the catch 👌
Updates ▶ https://t.co/O1RsjJTHhM#TeamIndia | #AUSvIND | @akshar2026 pic.twitter.com/HHfDZ73zBn
— BCCI (@BCCI) October 19, 2025
ఆఫ్‌సైడ్‌లో బౌండరీకి యత్నించిన హెడ్ బౌండరీ వద్ద హర్షిత్ రానా చేతికి చిక్కాడు. దాంతో. 10 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ పడింది. అనంతరం కెప్టెన్ మిచెల్ మార్ష్(32 నాటౌట్), మాథ్యూ షార్ట్(8) ఇన్నింగ్స్ నిర్మించి జట్టు స్కోర్ 40 దాటించారు. అయితే.. స్పిన్నర్‌ను రంగంలోకి దింపిన శుభ్‌మన్ గిల్ వ్యూహం ఫలించింది. కట్ షాట్ ఆడిన షార్ట్.. థర్డ్ మ్యాన్‌లో రోహిత్ చేతికి సులువైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో..44 వద్ద కంగారూ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది.