లక్నో: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రెండవ రోజు ఆమె వెయిట్ చెక్ చేశారు. దాంట్లో ఆమె బరువు వంద గ్రాములు ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆమెపై వేటు వేసింది. వినేశ్ పోగట్పై వేటు వేసిన ఘటనలో సాంకేతిక కారణాలపై అన్వేషణ చేపట్టాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. దాని వెనుక ఉన్న అసలైన కారణం బయటకు రావాలన్నారు. తన ఎక్స్ అకౌంట్లో అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని పోస్టు చేశారు.
विनेश फोगाट के फ़ाइनल में न खेल पाने की चर्चा के तकनीकी कारणों की गहरी जाँच-पड़ताल हो और सुनिश्चित किया जाए कि सच्चाई क्या है और इसके पीछे की असली वजह क्या है।
— Akhilesh Yadav (@yadavakhilesh) August 7, 2024