ముంబై: భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్.. తన పదవిలో మరో ఏడాదిపాటు కొనసాగనున్నాడు. 2023 జులై నుంచి సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న అతడి పదవీకాలాన్ని 2027 దాకా పొడిగించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అగార్కర్ హయాంలో భారత జట్టు నాలుగుసార్లు ఐసీసీ ట్రోఫీల ఫైనల్స్‌కు చేరి మూడు కప్పు (2024, 2025, 2026)లను సొంతం చేసుకుంది.