Ajit Agarkar : పురుషుల ఆసియా కప్ కోసం భారత సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అనుకున్నట్టే ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 15మంది బృందలో ఉన్నాడు. దాంతో, వర్క్‌లోడ్ కారణంగా ఈ మెగా టోర్నీలో బుమ్రాను ఆడిస్తారో? లేదో అనే వార్తలకు చెక్ పడింది. మంగళవారం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథిగా స్క్వాడ్‌ను ప్రకటించిన అనంతరం బుమ్రాపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు ప్రధాన బౌలర్ అయిన బుమ్రా పెద్ద టోర్నమెంట్లలో కచ్చితంగా ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. వర్క్‌లోడ్ గురించి అడుగగా.. కచ్చితమైన ప్రణాళికలు ఏవీ లేవని సమాధానం దాటవేశాడు అగార్కర్. ‘ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా అతడు మూడు మ్యాచులే ఆడాడు. సో అతడికి తగినంత విశ్రాంతి లభించిందని అనుకుంటున్నా. అతడిని టోర్నీ మొత్తం ఆడించాలా? కీలకమైన మ్యాచ్‌లకే తీసుకోవాలా? .. వంటి ప్రణాళికలు ఏవీ వేసుకోలేదు. ప్రస్తుతం ఫీజియో, జట్టు యాజమాన్యం బుమ్రాతో టచ్‌లో ఉన్నారు. ఆసియా కప్‌లో పెద్ద మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు సంజూ శాంసన్ ఎంపికపై కూడా అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.
🚨 A look at #TeamIndia‘s squad for #AsiaCup 2025 🔽 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025
‘టీ20లకు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఆడనందు వల్లనే సంజూకు అవకాశాలు వస్తున్నాయని చీఫ్ సెలెక్టర్ తెలిపాడు. టీ20 స్క్వాడ్ ఎంపిక సమయంలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటాం. అయితే.. అంతర్జాతీయంగా వన్డే, టెస్టు సిరీస్‌లు ఉండడంతో యశస్వీ, గిల్ పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో ఉండడం లేదు. అభిషేక్ ఫామ్ దృష్ట్యా అతడిని పక్కన పెట్టడం అసాధ్యం’ అని అగార్కర్ పేర్కొన్నాడు.
ఆసియా కప్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.