న్యూఢిల్లీ: ఈ యేటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్(IPL 2026 Final) మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ గేమ్స్‌కు చెందిన వేదికల వివరాలను కూడా ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. మే 31వ తేదీన .. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌ను ధర్మశాలలో, మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లను న్యూ చండీఘడ్‌లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2022, 2023 సీజన్లకు చెందిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌ను మే 26వ తేదీన నిర్వహించనున్నారు. లీగ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి. ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక మే 27వ తేదీన మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. న్యూ చండీఘడ్‌లోని కొత్త స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇక ఇదే వేదికపై మే 29వ తేదీన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
🚨 News 🚨
BCCI Announces #TATAIPL 2026 Playoffs Schedule
Qualifier 1: Dharamshala
Eliminator and Qualifier 2: New Chandigarh
Narendra Modi Stadium, Ahmedabad to Host Grand Finale 🏟️
More Details ▶️ https://t.co/32HvsabiuF#KhelBindaas pic.twitter.com/ItrNUNoxHZ
— IndianPremierLeague (@IPL) May 6, 2026