T20 World Cup 2026 : వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్ (T20 World Cup 2026) పోటీలకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సమయం సమీపిస్తున్నందున ఇరుదేశాల్లోని వేదికలను ఖరారు చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 8 నగరాలను ఎంపిక చేసింది. ఊహించినట్టే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి తొలి ప్రాధాన్యమిచ్చింది ఐసీసీ. ఆరంభ పోరుతో పాటు ఫైనల్ ఫైట్ కూడా ఇక్కడే జరుగుతుందని చెప్పిన ఐసీసీ ఆదివారం సెమీఫైనల్ స్టేడియాలను సైతం ప్రకటించింది.
పొట్టి ప్రపంచ కప్ బెర్తులు ఖరారు కావడంతో షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది ఐసీసీ. మొదటగా వేదికల్ని ఖరారు చేయాలి కాబట్టి.. ఆతిథ్య దేశాలైన భారత్‌లో ఐదు, లంకలోని రెండు నగరాలను ఎంపిక చేసింది ఐసీసీ. అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై.. శ్రీలంకలో కొలంబో, క్యాండీ సిటీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. సెమీఫైనల్స్ కోసం ఒకటి కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలను ఆడించాలని షార్ట్ లిస్ట్ చేశామని ఐసీసీ తెలిపింది. అయితే.. ముంబైలోని వాంఖడే స్టేడియం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
🚨 REPORTS 🚨
Wankhede Stadium is likely to host one of the semi-finals of the 2026 T20 World Cup. 🏆🏏#Cricket #T20 #WC #India pic.twitter.com/tZKQQDyM25
— Sportskeeda (@Sportskeeda) November 9, 2025
పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించడంపై పాక్ బోర్డు, బీసీసీఐ మధ్య అంగీకారం కుందిరింది. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో కాకుండా మ్యాచ్ నిర్వహించడం ఖాయం. అక్టోబర్ 17న ప్రకటించనట్టే ఈసారి కూడా 20 జట్లతో టోర్నీని నిర్వహించనున్నారు. టోర్నీకి అర్హత సాధించిన జట్లను ఏ గ్రూప్‌లో ఉంచాలి? ఏ మ్యాచ్‌లు ఎక్కడ ఆడించాలి? అనే వివరాల్ని కూడా త్వరలోనే ఐసీసీ ప్రకటించనుంది.
వరల్డ్ కప్ టోర్నీకి భారత్, శ్రీలంకతో పాటు నిరుడు జరిగిన ప్రపంచ కప్‌లో టాప్-7లో నిలిచిన అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్‌లకు నేరుగా బెర్తు దక్కింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ అర్హత సాధించాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ ద్వారా నమీబియా, జింబాబ్వే వరల్డ్ కప్ బరిలోకి వచ్చాయి. యూరప్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన ఇటలీ, నెదర్లాండ్స్.. అమెరికన్ క్వాలిఫయర్స్ నుంచి కెనడాలు క్వాలిఫై అయ్యాయి. ఇక చివరి క్వాలిఫయర్ టోర్నీ అయిన తూర్పు ఆసియా ఫసిఫిక్ నుంచి ఒమన్, నేపాల్, యూఏఈలు ప్రపంచ కప్‌లో పోటీపడే అవకాశాన్ని పట్టేశాయి.
వరల్డ్ కప్ బరిలోని జట్లు : భారత్, శ్రీలంక (ఆతిథ్య దేశాలు), ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ.
🚨 T20 World Cup Update
The 2026 Men’s T20 World Cup is likely to take place from February 7 to March 8.#CricketTwitter #T20WorldCup pic.twitter.com/pPIZf9bQtR
— CRICKETNMORE (@cricketnmore) November 9, 2025