Ajit Agarkar : భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) తన పని మొదలుపెట్టనున్నాడు. సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆటగాళ్లను కలవని అతను వెస్టిండీస్(Westindies) వెళ్లనున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే అతను అక్కడికి చేరుకుంటాడని సమచారం. అగార్కర్ విండీస్‌కు వెళ్లడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) జట్టు ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాల గురించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో అతను చర్చిస్తాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఈ విషయాన్ని బీసీసీ ఈరోజు వెల్లడించింది. ‘సెలెక్షన్ కమిటీలో ఒకడైన సలిల్ అంకోలా(Salil Ankola) ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నాడు. రెండో టెస్టు పూర్తి కాగానే అతను భారత్‌కు రానున్నాడు. వన్డే సిరీస్(ODI Series) ఆరంభానికి ముందే అగార్కర్ జట్టుతో కలవనున్నాడు’ అని బీసీసీఐ ప్రతినిధిలు వెల్లడించారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై అక్టోబర్ 5న మొదలవ్వనుంది. ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కోసం 11 ఏళ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా స్వదేశంలో రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. దాంతో బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకనే 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ 20మందిలో ఎవరెవరు ఉన్నారు? అనేది మాత్రం వెల్లడించలేదు.
టీమిండియా
టీమ్ మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్ల కమిటీ చర్చించి వరల్డ్ కప్ బృందాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. అందుకని అగార్కర్ వెస్టిండీస్ పర్యటనలోనే కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడాలని అనుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆటగాళ్ల బలాబలాలపై కూడా అగార్కర్ వీళ్లతో చర్చించనున్నాడు. దాంత్, వన్డే సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. భారత్, వెస్టిండీస్‌ల మధ్య తొలి వన్డే జూలై 22న జరుగనుంది.