Novak Djokovic : వింబుల్డన్ ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు మరో షాక్ తగిలింది. ఈ రెండో సీడ్ ఆటగాడికి నిర్వాహకులు భారీ ఫైన్ విధించారు. ఎందుకో తెలుసా..? కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)తో జరిగిన ఫైనల్ పోరులో జకోవిచ్ కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఐదో సెట్ సమయంలో తన రాకెట్‌ను నెట్ పోల్‌కు విసిరి కొట్టాడు. దాంతో, అది విరిగిపోయింది. అతడి చర్యను మ్యాచ్ అంపైర్ తీవ్రంగా పరిగణించారు. దాంతో జకోకు రూ.6.5లక్షల భారీ జరిమానా విధించారు.
రాకెట్‌ను విరగొట్టినందుకు(Racquet Abuse) జకోవిచ్‌కు ఫైన్ వేస్తున్నామని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(All England Lawn Tennis Club) ధ్రువీకరించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ చేతిలో జకోవిచ్ ఓడిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన జకోకు రూ.18 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అల్కరాజ్ ఈ మధ్యే కెనడా ఓపెన్(Canada Open 2023) విజేతగా నిలిచాడు. వింబుల్డన్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను వరుసగా ఐదోసారి వింబుల్డన్ చాంపియన్‌గా నిలవాలనుకున్నజకోవిచ్కు ఝలక్ ఇచ్చాడు. 1-6, 7-6 (8/6), 6-4, 3-6, 6-4తో భారీ విజయం సాధించాడు.
కార్లోస్ అల్కరాజ్, నొవాక్ జకోవిచ్
అయితే.. టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో జకో 23వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (22 గ్రాండ్‌స్లామ్స్) రికార్డు బద్ధలు కొట్టాడు.