India tour Of Zimbabwe: ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టుకు ఇది ముగిశాక ఆడబోయే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను బీసీసీఐ ప్రకటించింది. జూన్‌లో అమెరికా – వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), జింబాబ్వే క్రికెట్ బోర్డులు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు గాను జింబాబ్వేకు వెళ్లే భారత జట్టు.. అక్కడ జులై 6 నుంచి 14 దాకా జరుగబోయే ఈ సిరీస్‌లో పాల్గొననుంది.
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిశాక భారత క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడి తదనంతరం జూన్‌లో జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్‌కు బయల్దేరతారు. జూన్ చివరివారంలో ఈ మెగా టోర్నీ ముగియనుంది. అది ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యే భారత ఆటగాళ్లు నేరుగా అమెరికా నుంచే జింబాబ్వేకు వెళ్లనున్నారు. భారత జట్టు జింబాబ్వేతో 2022 టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారి తలపడింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగంగా భారత్.. 2016లో ఆఖరిసారి జింబాబ్వేకు వెళ్లింది. ఆ సిరీస్‌లో టీమిండియా.. 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది.
భారత్ – జింబాబ్వే షెడ్యూల్:
– ఫస్ట్ టీ20 : జులై 6
– సెకండ్ టీ20 : జులై 7
– థర్డ్ టీ20 : జులై 10
– ఫోర్త్ టీ20 : జులై 13
– ఫిఫ్త్ టీ20 : జులై 14
India Tour of Zimbabwe
🗓️ July 2024
5⃣ T20Is 🙌
📍 HarareMore details 👉 https://t.co/lmtzVUZNCq#TeamIndia | #ZIMvIND pic.twitter.com/CgVkLS8JIB
— BCCI (@BCCI) February 6, 2024
– మ్యాచ్‌లన్నీ హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి. ఈ సిరీస్ ద్వారా జింబాబ్వే క్రికెట్ బోర్డుకు కాస్త ఊరట లభించనుంది. భారత్ వంటి అగ్రశ్రేణి జట్టుతో సిరీస్ కోసం అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవేంగ్వ ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ సిరీస్‌కు అంగీకరించినందుకు ఆయన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.