ముంబై: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రేమ మళ్లీ విఫలమైంది. ఇప్పటికే నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న హార్దిక్ గత కొన్ని రోజులుగా బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో సాగిస్తున్న ప్రేమాయణానికి బ్రేకప్ పడినట్లు తెలుస్తున్నది. ఒకరికొకరు సోషల్‌మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకోవడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
అయితే దీనిపై ఇరువైపులా నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గత ఐపీఎల్ సీజన్లో హార్దిక్‌పాండ్యాకు మద్దతుగా నిలుస్తూ ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్‌లకు జాస్మిన్ స్టేడియాలకు రావడం మీడియాలో ప్రముఖంగా నిలిచింది. దీనికి తోడు గ్రీస్‌లో ఇద్దరు కలిసి రొమాంటిక్‌గా దిగిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే స్టాంకోవిచ్‌ను 2020లో వివాహం చేసుకున్న హార్దిక్ గతేడాది విడిపోయారు. వీరిద్దరి ఆగస్త్య జన్మించిన సంగతి తెలిసిందే.