టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కొవిడ్-19 వాక్సిన్ తొలి డోసును శనివారం వేయించుకున్నాడు. ‘టీకా తీసుకున్నాను. విపత్కర పరిస్థితుల్లో వైద్యసేవలు అందిస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లందరికీ ధన్యవాదాలు. మీకు అవకాశం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ ఉమేశ్ ట్వీట్ చేశాడు. టీకా తీసుకుంటుండగా తీసిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. టీమ్ఇండియా టెస్టు వైస్‌కెప్టెన్ రహానె, అతని భార్య రాధిక ఇవాళ తమ మొదటి డోసు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.
Vaccination done ✔️
— Umesh Yaadav (@y_umesh) May 8, 2021
A big thank you to all our health care workers and I urge everyone to get vaccinated when you get the opportunity. 🙏 pic.twitter.com/kqJMtomer0