ODI World Cup 2023: అఫ్గనిస్థాన్ జట్టు వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కోసం భారత్‌కు వచ్చేసింది. ఈరోజు కేరళలోని తిరువనంతపురంలో అడుగుపెట్టింది. అక్కడి హయత్ రెజెన్సీ హోటల్(Hayat Regency Hotel)లో అఫ్గనిస్థాన్ టీమ్‌కు ఘన స్వాగతం లభించింది. హష్మతుల్లా షాహీదీ(Hashmatullah Shahidi) బృందాన్ని హోటల్ సిబ్బంది కేరళ సంప్రదాయ పద్ధతిలో శాలువాలు కప్పి, చేతికి కొబ్బరి బోండాం ఇచ్చి అహ్వానించారు.
అనంతంరం స్లార్ ప్లేయర్లు మహమ్మద్ నబీ(Mohammad Nabi), రషీద్ ఖాన్(Rashid Khan), ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్ ఫొటోలకు పోజిచ్చారు. సెప్టెంబర్ 28న శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం(Greenfield International Stadium)లో దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్ ఆడనుంది.
Welcome to India, Afghanistan 🇦🇫 🤩
Looking forward to exciting #CWC23 action 🙌
📸 @ACBofficials pic.twitter.com/5QABkEiUUH
— ICC (@ICC) September 26, 2023
తెంబ బవుమ(Temba Bavuma) సారథ్యంలోని సఫారీ జట్టు నిన్ననే భారత్‌కు చేరుకుంది. అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదలవ్వనుంది. అఫ్గనిస్థాన్ జట్టు తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 7న బంగ్లాదేశ్(Bangladesh)తో తలపడనుంది.
అఫ్గనిస్థాన్ వరల్డ్ కప్ బృందం : హష్మతుల్లా షాహీదీ(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, మహమ్మద్ నబీ, ఇక్రం అలిఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారుఖీ, అబ్దుల్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్.