Asian Games 2023 : ఆసియా గేమ్స్(Asian Games 2023)లో భారత స్క్వాష్ క్రీడాకారిణులు(Indian Squash Players) అదరగొట్టారు. పూల్ బిలో(Pool B) ఈరోజు జరిగిన పోరులో పాకిస్థాన్ త్రయాన్ని 3-0తో వైట్‌వాష్ చేశారు. మొదట అనహత్ సింగ్ (Anahat Singh) సదియా గుల్‌పై11-6, 11-6, 11-3 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప(Joshna Chinnappa) 11-2, 11-5, 11-7)తో నూర్ ఉల్ హుడా సాదిఖ్‌ను ఓడించింది.
భారత యువ సంచలనం తన్వీ ఖన్నా(Tanvi Khanna) పాక్ క్రీడాకారిణి నూర్ ఉల్ ఐన్ ఇజాజ్‌పై 11-3, 11-6, 11-3 పాయింట్లతో అద్భుత విజయం సాధించింది. భారత క్రీడాకారిణులు తర్వాతి రౌండ్లో నేపాల్ టీమ్‌ను ఢీ కొట్టనున్నారు. సెప్టెంబర్ 27న బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది.