ICC Mens ODI World Cup 2023 | టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapi Dev) కిడ్నాప్ అయ్యాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో నిజమే అనుకున్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కపిల్ పాజీ కిడ్నాప్ కాదుగా.. అందులోని వ్యక్తి నిజమైన కపిల్ దేవ్ కాడని నమ్ముతున్నా. కపిల్ పాజీ క్షేమంగా ఉన్నాడని అనుకుంటున్నా’ అని ఎక్స్‌లో రాసుకోచ్చాడు. దీంతో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వీడియోపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) క్లారిటీ ఇచ్చింది.
Ind vs Aus | వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) సమరానికి కౌంట్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. మరో 09 రోజుల్లో భారత గడ్డపై ఈ మెగా టోర్నీ షురూ కానుంది. అయితే ఈ మెగా టోర్నీపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు హాట్ స్టార్ (Disney+ Hotstar) సోషల్ మీడియాలో తెలిపింది. అయితే హాట్ స్టార్ ఈ విషయాన్ని తెలుపుతూ.. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో ఒక ఫన్నీ వీడియో రూపొందించింది.
.@therealkapildev paaji ko kidnap kyun karna? #DisneyPlusHotstar hai na!
Dekho poora ICC Men’s Cricket World Cup bilkul FREE on mobile! Data saver mode ke saath!#ItnaSabFreeKa #WorldCupOnHotstar pic.twitter.com/LcoEcr3Iub
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 26, 2023
ఈ వీడియోలో కొందరు వ్యక్తులు కపిల్‌దేవ్‌ను కిడ్నాప్ చేసి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కుర్చీలో కట్టేస్తారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముడతారు. కెప్టెన్ జీ ని ఎందుకు కిడ్నాప్ చేశారు.. అని పోలీసు అధికారి కిడ్నాపర్లను అడుగుతాడు. కిడ్నాపర్ రిప్లయ్ ఇస్తూ.. ప్రపంచ కప్ టైంలో కరెంట్ కోతలు ఉండవని మాకు గ్యారెంటీ కావాలని చెబుతాడు. దీనికి పోలీసు బదులిస్తూ.. కరెంట్ గురించి టెన్షన్ ఎందుకు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను పూర్తి ఉచితంగా చూడొచ్చు అని చెప్పడంతో.. కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన కిడ్నాపర్లు ఆయన్ను వదిలేస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక కపిల్ దేవ్ కిడ్నాప్ డ్రామా అంతా ప్రకటన కోసం అని తెలిసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.