Emerging Asia Cup : ఎమర్జింగ్ ఆసియా కప్ రెండో సెమీఫైనల్లో భారత ఏ జట్టుకు అఫ్గనిస్థాన్ ‘ఏ’ (Afghanistan) కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన అఫ్గన్ జట్టుకు ఓపెనర్లు సెదికుల్లాహ్ అటల్(83), జుబైద్ అక్బరీ(64)ల విధ్వంసంతో రెండొందలు కొట్టేసింది. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లను ఉతికేసిన ఈ జోడీ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కెప్టెన్ తిలక్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దాంతో, అఫ్గన్ ఏ జట్టు 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 206 పరుగులు చేసింది.
ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ బెర్తు కోసం భారత ఏ జట్టు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీగ్ దశలో అన్నిజట్లను చిత్తుగా ఓడించిన టీమిండియాకు సెమీస్లో అఫ్గనిస్థాన్ జట్టు పెద్ద సవాల్ విసిరింది. ఓపెనర్లు సెదికుల్లాహ్ అటల్(83), జుబైద్ అక్బరీ(64)లు అర్ధ శతకాలో వీరవిహారం చేశారు. వీళ్ల జోరుతో స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు తీసింది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అటల్, అక్బరీలు అఫ్గనిస్థాన్కు బలమైన పునాది వేశారు. ఎట్టకేలకు అకీబ్ ఖాన్ బౌలింగ్లో అటల్ కావడంతో భారత బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.
🔙 to 🔙 wickets in a crucial fixture! 👊@BCCI#MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/ysL0JvWEDD
— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024
అయితే.. అప్పటికే చేయాల్సిన నష్టమంతా అటల్ చేసేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆల్రౌండర్ కరీమ్ జనత్ (41) సైతం రెచ్చిపోయి ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడికి తోడు ఓపెనర్ అటల్ కూడా దంచడంతో అఫ్గన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. భారత బౌలర్లలో అందరూ భారీగా పరుగులు ఇవ్వగా.. రసిక్ సలామ్ ఒక్కడే ౩ వికెట్లతో రాణించాడు.