Kanguva | తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే బాలీవుడ్ ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకున్న సూర్య తాజాగా టాలీవుడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.
ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 షోతో పాటు నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8కి గెస్ట్‌గా వెళ్లాడు సూర్య. దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నయి. ఇదిలావుంటే తాజాగా ఒక ప్రెస్ మీట్లో పాల్గోన్నాడు సూర్య. ఈ ప్రెస్ మీట్లో కంగువ కలెక్షన్స్‌పై ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
రిపోర్టర్ సూర్యని అడుగుతూ.. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రూ. 2000 కోట్లు వసూళ్లు చేస్తుందని నిర్మాత అన్నారు కదా.. దీనిని ఎలా తీసుకుంటారు అంటూ సూర్యని అడిగాడు. దీనికి సూర్య మాట్లాడుతూ.. పెద్ద కలలు కనడంలో నేరమేంటి?. ఈ సినిమా అంతగా వసూళ్లు చేస్తుందనే నమ్మకం ఉంది. అదే జరిగితే అందరూ హ్యాపీ అంటూ సూర్య చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Q: producer Gnanavel said #Kanguva is the first 2000Cr project from Kollywood. How positive are you❓#Suriya: what is a crime if you dream big. I believe in the manifestation, let it happen & everybody be happy 🫶 pic.twitter.com/HJKywFhHMy
— AmuthaBharathi (@CinemaWithAB) October 24, 2024