IND vs AFG : టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి సూపర్ 8కు చేరిన అఫ్గనిస్థాన్ (Afghanistan).. అజేయంగా దూసుకెళ్తున్న భారత్ (India) జట్టుతో కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. కరీబియన్ గడ్డ మీద టీమిండియాకు రషీద్ ఖాన్(Rashid Khan) సారథ్యంలోని అఫ్గనిస్థాన్ జోరుకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు కాబూలీ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) నిప్పు రాజేశాడు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే తన లక్ష్యం కాదని, టీమిండియా ప్రతి బౌలర్‌ను టార్గెట్ చేస్తానని గుర్బాజ్ అన్నాడు. అంతేకాదు ఈసారి అఫ్గనిస్థాన్ జట్టు ట్రోఫీ గెలవాలనే కసితో ఆడుతోందని ఈ హిట్టర్ తెలిపాడు.
‘నిజంగా చెప్తున్నా. నా టార్గెట్ బుమ్రా ఒక్కడే కాదు. భారత బౌలింగ్ యూనిట్ మొత్తాన్ని నేను ఉతికేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే బమ్రాతో పాటు ఐదుగురు బౌలింగ్ చేస్తారు. వాళ్లను నేను కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ నాకు బమ్రా ఓవర్లో షాట్ ఆడే చాన్స్ వస్తే అస్సలు వదులుకోను. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.. ఎవరైనా సరే నాకు అనువైన ప్రదేశాల్లో బంతి వేశారంటే దంచేస్తాను.
ఒకవేళ నేను ఔట్ కావొచ్చు లేదా వాళ్లపై పై చేయి సాధించొచ్చు’ అని గుర్బాజ్ మీడియా సమావేశంలో వెల్లడిచాడు. లీగ్ దశలో రషీద్ సేన విజయాల్లో గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్‌తో కలిసి శుభారంభాలు ఇస్తూ మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గించాడు. టీమిండియాతో సూపర్ 8 ఫైట్‌లోనూ ధనాధన్ ఆడాలని గుర్బాజ్ భావిస్తున్నాడు.
Final training session for India in Barbados ahead of their opening Super Eight fixture at the #T20WorldCup against Afghanistan 🙌 pic.twitter.com/dFCdGlghgm
— ICC (@ICC) June 20, 2024
వరల్డ్ కప్‌లో అఫ్గనిస్థాన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతోంది. పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ వికెట్ల వేట కొనసాగిస్తుండగా.. స్పిన్నర్లు రషీద్, నూర్ అహ్మద్‌లు తిప్పేస్తున్నారు. ఇక ఛేదనరలో ఓపెనర్లు గుర్బాజ్, జర్డాన్, ఒమర్జాయ్, గుల్బదిన్‌లు వీరబాదుడు బాదుతున్నారు. దాంతో, అఫ్గన్ జట్టు వరుసగా ఉగాండా, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా జట్లను ఓడించి సూపర్ 8కు అర్హత సాధించింది.
Preps in full force 👊#AfghanAtalan have hit the ground running ahead of thier first #T20WorldCup Super Eights game against India. 🤩#AFGvIND | #GloriousNationVictoriousTeam pic.twitter.com/75OVUQeF7U
— Afghanistan Cricket Board (@ACBofficials) June 20, 2024
సంచలనాలకు కేరాఫ్ అయిన కాబూలీ టీమ్.. ఈసారి భారత జట్టుకు షాకిస్తుందా? లేదా వరల్డ్ క్లాస్ బ్యాటర్ల జోరు.. బౌలర్ల దూకుడు ముందు చతికిలపడుతుందా? అనేది మరికొన్ని గంట్లలో తేలిపోనుంది. గురువారం రాత్రి 8 గంటలకు బార్బడోస్ వేదికగా భారత్, అఫ్గనిస్థాన్‌లు తలపడనున్నాయి.