హైదరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్ట్(BLR Trust) చేస్తున్న కృషి అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు. చర్లపల్లి డివిజన్ చక్రీపురంకు చెందిన పెరపు నర్సింహ్మ, దేవమణి దంపతుల కుమారుడు ప్రశాంత్ ఉస్మానియా వైద్యశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన అతడు ఫీజు కట్టకపోవడంతో స్థానికులు బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Laxmareddy) దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా మంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మెడిసిన్ సీట్ సాధించిన పేద విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఐదు సంవత్సరాల ఫీజులు చెల్లించడం హర్షనీయమన్నారు. నియోజకవర్గ పరిధిలో పేదల సంక్షేమం కోసం ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తి దాయకమ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.