అమరావతి : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో సిలిండర్లు పేలి దివ్యాంగురాలు(Disabled girl) సజీవదహనమయ్యింది. గురువారం నెల్లూరు (Nellore ) లోని బర్మా షెటల్ గుంటల్లో ప్రమాదవశాత్తు గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలో ఉన్న ఆరు సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న మరో నాలుగు గుడిసెలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని నాగలక్ష్మి(12) అనే దివ్యాంగురాలైన బాలిక మృతి చెందింది. అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.