ముంబై: ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్జాయ్.. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. పేస్ బౌలింగ్‌తో పాటు పవర్‌ఫుట్ బ్యాటింగ్‌తో అతను 2024లో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇవాళ ఈ యేటి వన్డే క్రికెటర్ పేరును ప్రకటించింది. 24 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా .. తన వన్డే కెరీర్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. వన్డే క్రికెట్లో అతనో కీలక ప్లేయర్‌గా ఆవిర్భవించాడు.
జాతీయ జట్టుకు అత్యధిక రన్స్ చేసిన రెండో ఆఫ్ఘన్ బ్యాటర్‌గా నిలిచాడు. గత ఏడాది అతను 417 రన్స్ స్కోర్ చేశాడు. ఇక బౌలింగ్‌లో 17 వికెట్లు తీసుకున్నాడు. 14 మ్యాచుల్లో అతను ఈ ఫీట్ అందుకున్నాడు. నిలకడగా రాణిస్తున్న అజ్మతుల్లా వల్ల.. ఆఫ్ఘన్ జట్టు నాలుగు సిరీస్‌లను గెలుచుకున్నది. ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ల్లో అజ్మతుల్లా కీలక పాత్ర పోషించాడు.
గత ఏడాది మొత్తం అతను బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. బ్యాటింగ్‌లో 52.12 సగటుతో అతను స్కోరింగ్ చేశాడు. బౌలింగ్‌లో 20.47 యావరేజ్‌తో వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 149 రన్స్ చేయగా, దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను 50 బంతుల్లో 86 రన్స్ స్కోర్ చేశాడు.
Azmatullah Omarzai has asserted himself as one of the most versatile white-ball players in the world by taking out 2024’s ICC Men’s ODI Cricketer of the Year 💪 pic.twitter.com/vjCPBIMFDC
— ICC (@ICC) January 27, 2025