న్యూఢిల్లీ: అప్ఘానిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి వీరవీహారం చేస్తున్న ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బట్లర్ వేసిన త్రోకు గుర్బాజ్ రనౌట్ అయ్యాడు. అప్పటికి అప్ఘానిస్థాన్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 122 పరుగులు. అంతకుముందు బంతికే రహమత్ షా (3)ను బట్లర్ స్టంప్ ఔట్ చేశాడు.
కాగా, ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ అఫ్ఘానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్ గుర్బాజ్ వీరోచిత బ్యాటింగ్‌తో కేవలం 13 ఓవర్లకే అప్ఘాన్ స్కోర్ 100 పరుగులు దాటింది. ఆ తర్వాత నుంచి వరుసగా వికెట్లు పతనమయ్యాయి. దాంతో 114/0 తో పటిష్టంగా ఉన్న అప్ఘాన్ 123/3 చేరింది.