న్యూఢిల్లీ: అప్ఘానిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ రహమానుల్లా గుర్బాజ్ ఇంగ్లండ్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో వీరవిహారం చేస్తున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను చెండాడుతున్నాడు. దాంతో కేవలం 13 ఓవర్లలో అఫ్ఘానిస్థాన్ స్కోర్ 100 పరుగులు దాటింది. 13 ఓవర్ల ఆట ముగిసే సమయానికి అఫ్ఘాన్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా 102 పరుగులు చేసింది.
ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ 67 (4 సిక్సులు, 7 ఫోర్లు) పరుగులు, మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్ 24 (3 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. రహమానుల్లా ఊపు చూస్తుంటే అప్ఘానిస్థాన్ 400కు పైగా పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించేలా కనిపిస్తున్నది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ద్వారా ఇంగ్లండ్ తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్టే కొడుతోంది.