న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఫిల్మ్ స్టార్ రాధికా శరత్‌కుమార్(Radikaa Sarathkumar )తో సెల్ఫీ దిగారు. ఆ ఇద్దరూ లండన్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో కలుసుకున్నారు. కోహ్లీతో సెల్ఫీ దిగడాన్ని నటి రాధిక థ్రిల్ ఫీలయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను పోస్టు చేసిందామె. దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. భారత బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించింది. లక్షలాది మంది హృదయాల్లో నిలిచిన వ్యక్తి కోహ్లీ అని, క్రికెట్‌కు కట్టుబడి దేశాన్ని గర్వంగా నిలిపాడని,అతనితో ట్రావెల్ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని, సెల్ఫీ దిగినందుకు థ్యాంక్స్ అంటూ రాధిక తన పోస్టులో పేర్కొన్నది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ జరనున్న నేపథ్యంలో.. లండన్ నుంచి కోహ్లీ శుక్రవారం అక్కడకు చేరుకున్నాడు. జనవరిలో దక్షిణాప్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు కోహ్లీ మిస్సయ్యాడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత అతను టెస్టుల్లో ఆడనున్నాడు.