NBA Player Rashid Byrd |ప్రముఖ నటుడు, అమెరికాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లో ఆడిన మాజీ ఆటగాడు రషీద్ బైర్డ్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టు షాకిచ్చింది. సెలబ్రిటీ ముసుగులో పలువురిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులలో అతడికి 90 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడున్నరేండ్లుగా పోలీసుల కస్టడీలోనే ఉన్న రషీద్‌కు తాజాగా జైలు శిక్ష ఖరారైంది.
ఎన్బీఏలో లాస్ ఏంజెల్స్ డి-ఫెండర్స్ తరఫున 2008-2009 సీజన్లో ఆడిన ఈ 39 ఏండ్ల మాజీ ఆటగాడు.. అదే ఏడాది విల్ ఫెరెల్ నటించిన బాస్కెట్‌బాల్ కామెడీ చిత్రం ‘సెమీ ప్రో’లో నటించాడు. లాస్ ఏంజెల్స్ తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. ఓ మహిళతో సెలబ్రిటీ అన్న ముసుగులో ముందు నమ్మకస్తుడిగా నటించి తర్వాత తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో పేర్కొంది.
FORMER NBA player Rashid Byrd has been sentenced to 90 years to life in prison for the attacks and was accused of sexually assaulting several women in multiple states, said police. pic.twitter.com/wWBWCDmb0o
— 𝕏 News (@XNews_29) March 3, 2024
2005లో వాషింగ్టన్లో రషీద్ తనపై లైంగికదాడికి పాల్పడ్డట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో అతడు 2010లో ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత 2019లో మరో మహిళను లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదు రావడంతో లాస్ ఏంజెల్స్ పోలీసులు అతడిని 2020లో కస్టడీలోకి తీసుకున్నారు. సుదీర్ఘకాలం విచారణ జరిగిన ఈ కేసులో ఎట్టకేలకు లాస్ ఏంజెల్స్ కోర్టు ఇటీవలే విచారణను పూర్తిచేసి అతడికి 90 ఏండ్ల జీవిత ఖైదు ఖరారుచేసింది.