తాష్కెంట్: ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ అచింతా షెహులి రజత పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 73కిలోల విభాగంలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరుస్తూ అచింత రజతాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఓవరాల్‌గా 313కిలోల బరువెత్తిన ఈ 19 ఏండ్ల లిఫ్టర్..స్నాచ్‌లో 141కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 172కిలోలు ఎత్తి ఔరా అనిపించాడు. గత నెలలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 309కిలోల(139కి+170కి) ప్రదర్శనను అచింత తాజాగా తిరుగరాశాడు. ఇదే పోటీలో జునైన్సిక్ రిజ్కి(349కి), సెరోబియన్ గ్రెవోర్గ్(308కి) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. స్నాచ్‌లో తొలుత 137కిలోలు ఎత్తిన అచింత..ఆ ఆ తర్వాత 141 కిలోలు ఎత్తి కాంస్యం దక్కించుకున్నాడు.