దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన సన్నీ థిల్లాన్‌కు ఆరేళ్ల బ్యాన్ విధించింది ఐసీసీ. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబు దాబి టీ10 క్రికెట్(Abu Dhabi T10 League)లో ఓ ఫ్రాంచైజీకి చెందిన మాజీ అసిస్టెంట్ కోచ్‌ను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బహిష్కరిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన ప్రకటనలో తెలిపింది. యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించిన 8 మందిలో అసిస్టెంట్ కోచ్ థిల్లాన్ ఒకరు. 2021లో జరిగిన అబుదాబి టీ10 క్రికెట్ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు థిల్లాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతను మ్యాచ్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి.
Former assistant coach of a Abu Dhabi T10 Cricket League franchise has been banned for breaching the Anti-Corruption Code.https://t.co/Qk7FeoTkkN
— ICC (@ICC) December 10, 2024