ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్‌లో ఉన్నారు. లీగ్ దశనుంచి ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇక బౌలర్ల యూనిట్లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) నంబర్ 1 స్థానంలో నిలవగా.. ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అగ్ర పీఠంలోనే ఉన్నాడు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో వీరకొట్టుడు కొడుతున్న అభిషేక్ టాప్ ర్యాంక్ కాపాడుకున్నాడు. 907 రేటింగ్ పాయింట్స్‌తో ఈ యంగ్‌స్టర్ అగ్రస్థానాన్ని అట్టిపెట్టుకున్నాడు. దుబాయ్‌లో సెప్టెంబర్ 21న జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాక్ బౌలర్లను ఉతికేసిన ఈ డేంజరస్ ఓపెనర్ అర్ధ శతకంతో జట్టు విజయంతో కీలకమయ్యాడు. అభిషేక్ విధ్వంసాన్ని కొనసాగించిన తిలక్ వర్మ (Tilak Varma) ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంక్ సాధించాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)సైతం ఒక ర్యాంక్ మెరుగుపరచుకొని ఆరో స్థానంలో నిలిచాడు.
ICC T20 RANKINGS ( Indian’s )
No.1 Batsman – Abhishek Sharma
No.1 Bowler – Varun Chakraborty
No.1 Allrounder – Hardik PandyaIndian players have dominated all three departments in T20 and are number one in all three departments.#AsiaCup #INDvsBAN pic.twitter.com/7pwj3kfRdd
— D.S. Bhati (@DSCricinfo789) September 24, 2025
ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 238 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. అక్షర్ పటేల్ 168 రేటింగ్స్‌తో 11వ స్థానం దక్కించుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి 747 రేటింగ్స్‌తో టాప్‌లో నిలవగా.. జాకబ్ డఫ్ఫీ (ఇంగ్లండ్) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ ఏకంగా 12 స్థానాలు అధిగమించి నాలుగో ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఆసియా కప్ సూపర్ 4 తదుపరి రెండు మ్యాచ్‌లు.. ఆపై ఫైనల్లోనూ భారత ఆటగాళ్లు చెలరేగిపోతే మరికొన్నా్ళ్లు అగ్రస్థానంలోనే ఉండే అవకాశముంది.