ICC T20 Rankings | దుబాయ్: టీ20 ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపుతోంది. బంతిని బాదడంలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 38 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఈ పంజాబ్ కుర్రాడు.. ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించి 54 బంతుల్లోనే 135 పరుగులు చేయడంతో అతడి ర్యాంకు రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఈ జాబితాలో ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా తిలక్ వర్మ మూడు, సూర్యకుమార్ యాదవ్ 5వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ మూడు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరాడు.