Abhishek Sharma : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ భారీ ఛేదనలో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదేశాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో.. పదమూడేళ్ల క్రితం దాయాదుల సమరంలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు అభిషేక్.
సయూం ఆయూబ్ ఓవర్లో బౌండరీతో యాభైకి చేరువైన ఈ చిచ్చరపిడుగు రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. ఆ తర్వాత అబ్రార్ ఓవర్లో సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్ట్ హ్యాండర్.. రవుఫ్ ఓవర్లో పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద అబ్రార్ చేతికి చిక్కాడు. దాంతో.. అతడి సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
FIFTY!
Abhishek Sharma brings up a fantastic half-century off just 24 deliveries.
His third in T20Is 👏🔥
Live – https://t.co/XXdOskvd5M #AsiaCup2025 #Super4 pic.twitter.com/IJtM0H8DEU
— BCCI (@BCCI) September 21, 2025
చిరకాల ప్రత్యర్థుల టీ20 మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు మాత్రం మొహమ్మద్ హఫీజ్ పేరిట ఉంది. అతడు2021లో అహ్మదాబాద్‌లో 23 బంతులకే అర్ధ శతకం సాధించాడు. అభిషేక్ 24 బంతుల్లో ఫిఫ్టీతో రెండో స్థానానికి దూసుకురాగా.. యువరాజ్ సింగ్ (29 బంతులు) మూడో స్థానానికి పడిపోయాడు. ఇఫ్తాకార్ అహ్మద్ 32 బంతుల్లో, మిస్బావుల్ హక్ 33 బంతుల్లో అర్ధ శతకాలు బాదారు.