IPL 2025 : ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికేస్తున్న అభిషేక్ శర్మ(56) హాఫ్ సెంచరీ బాదేశాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా బౌండరీ సాధించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడీ ఓపెనర్. దాంతో, 7 ఓవర్లకు హైదరాబాద్ జట్టు వికెట్ కోల్పోకుండా 93 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంకా కమిన్స్ సేన విజయానికి 78 బంతుల్లో 153 పరుగులు అంటే.. ఓవర్‌కు 11.77 చొప్పున రన్స్ రావాలి.
ఎట్టకేలకు సన్‌రైజర్స్ ఓపెనర్లు ఫామ్‌లోకి వచ్చారు. 245 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ఇద్దరూ పోటాపోటీగా ఆడుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్(30) రెండు బౌండరీలు బాదాడు. యాన్సెస్ బౌలింగ్‌లో బ్యాట్ ఝులిపించిన అభిషేక్ శర్మ(56) 4 ఫోర్లు సంధించి 16 రన్స్ పిండుకున్నాడు.
Mirror starts, matching intent 💪
Strong powerplay for both sides but who’ll have the last laugh? 🤔
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/7iJMIiocYA
— IndianPremierLeague (@IPL) April 12, 2025
అనంతరం అర్ష్‌దీప్‌కి చుక్కలు చూపిస్తూ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు హెడ్. దాంతో 3 ఓవర్లకే సన్‌రైజర్స్ స్కోర్ 40కి చేరింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన యశ్ ఠాకూర్ ఓవర్లో అభిషేక్ సిక్సర్ బాదగా స్కోర్ 50 దాటింది. కానీ, ఆ తర్వాత బంతికే బౌండరీ వద్ద శశాంక్ సింగ్ క్యాచ్ అందుకున్నా అది నో బాల్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ సంబురాలు చేసుకుంది.