IPL 2025 : ఐపీఎల్ 18 వ సీజన్లో మెరుపు శతకం బాదిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(59) ఈసారి మెరుపు అర్థ శతకం సాధించాడు. సంచలన స్పిన్నర్ రవి బిష్ణోయ్(Ravi Bishnoi) బౌలింగ్‌లో రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సిక్సర్లతో లక్నో స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లే తర్వాతి ఓవర్ వేసిన ఈ లెగ్ స్పిన్నర్‌కు చుక్కలు చూపిస్తూ వరుసగా 4 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 18 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరువయ్యాడీ హిట్టర్.
అభిషేక్ మెరుపులతో హైదరాబాద్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే.. అనంతరం దిగ్వేశ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన అభి.. బౌండరీ వద్ద శార్దూల్ చేతికి దొరికాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ 99 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(20), హెన్రిచ్ క్లాసెన్(3)లు ఆడుతున్నారు. ఇంకా సన్‌రైజర్స్ విజయానికి 72 బంతుల్లో 103 పరుగులు కావాలి.
When Abhishek Sharma decided to make the ball fly 🚀
🎥 A glimpse of his onslaught during a blistering 59(20) 🔥
Updates ▶ https://t.co/GNnZh911Xr#TATAIPL | #LSGvSRH | @SunRisers pic.twitter.com/92w8j21Niw
— IndianPremierLeague (@IPL) May 19, 2025
అయితే.. అభిషేక్ వికెట్ తీశాక దిగ్వేశ్ ‘పెవిలియన్ వెళ్లు’ అని చేయి ఊపుతూ.. తనదైన సిగ్నేచర్ నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అతడి వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన ఓపెనర్..లక్నో స్పిన్నర్‌తో ‘ఏం అన్నావ్?’ అని అడగ్గా.. ‘అదేం లేదు. నిన్ను ఏం అనలేదు’ అని అతడు బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దది అవుతుందని గ్రహించిన అంపైర్లు, సారథి పంత్ ఇరువురికి సర్ధి చెప్పారు.
Digvesh Rathi celebration on….🔥
DENGEROUS Abhishek Sharma gone ..
Abhishek Sharma isn’t look happy with his notebook celebration 👀
.#LSGvSRH #SRHvLSG #LSGvsSRH #SRHvsLSG pic.twitter.com/36g3Julj7g— Monu Sharma (@bharatpur0777) May 19, 2025