Abhishek Sharma | 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రెండో భారతీయుడిగా అభిషేక్..!
Abhishek Sharma : పొట్టి క్రికెట్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రికార్డుల మోత మోగిస్తున్నాడు. టీ20ల్లో ఆడితే తనలానే ఆడాలని చాటుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వేగవంతమైన అర్ధ శతకంతో చరిత్ర సృష్టించాడు.
Abhishek Sharma : పొట్టి క్రికెట్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) రికార్డుల మోత మోగిస్తున్నాడు. టీ20ల్లో ఆడితే తనలానే ఆడాలని చాటుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ వేగవంతమైన అర్ధ శతకంతో చరిత్ర సృష్టించాడు. గువాహటిలో న్యూజిలాండ్ బౌలర్ల భరతం పడుతూ దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా యువరాజ్ సింగ్ (Yuvraj Singh)తర్వాత ఈ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఆటగాడిగా ఘనత సొంతం చేసుకున్నాడు అభిషేక్.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే హెన్రీని వణికిస్తూ.. ఇషాన్ కిషన్ వరుసగా 6, 6, 4 బాదగా రెండో ఓవర్లో అభిషేక్ రెచ్చిపోయాడు. డఫ్ఫీకి చుక్కలు చూపిస్తూ.. 6, 4 కొట్టిన అతడు.. మూడో ఓవర్లోనూ సిక్స్, ఫోర్ సంధించాడు. డఫ్పీ వేసిన ఆరో ఓవర్లో మరింత చెలరేగిన అభి.. 4, 4, 6 తో 14 బంత్లులోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
FIFTY off just 14 deliveries 🤯
Second-fastest T20I fifty ever by an Indian in Men’s Cricket 🫡🫡
Abhishek Sharma on a roll 🔥
Updates ▶️ https://t.co/YzRfqi0li2#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank ️ pic.twitter.com/HnIVrRCC26
— BCCI (@BCCI) January 25, 2026
అనంతరం ఎల్ సింబల్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడీ హిట్టర్. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్ధ శతకంతో చరిత్ర లిఖించాడు. తన గురువైన యూవీ రికార్డుకు రెండు బంతుల దూరంలో ఆగిపోయాడు అభి. అతడి మెరుపులతో పవర్ ప్లేలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది టీమిండియా. ఆరు ఓవర్లలోనే 94 రన్స్ చేసిన భారత్.. 2025లో ఇంగ్లండ్‌పై వాంఖడేలో 95 పరుగులతో రికార్డు నెలకొల్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

