గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో సీపీఎస్ఈయూ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ఆసక్తి చూపుతున్నది. రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నది.
- ఓటరు నమోదును ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ఆసక్తి చూపుతున్నది. రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నది. ఈ మేరకు యూనియన్ నాయకులు కసరత్తును తీవ్రతరం చేశారు. దీంట్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ఓటరు నమోదు పోస్టర్‌ను ఆవిష్కరించి నమోదును ప్రారంభించారు.
స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో రెండు లక్షలకుపైగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులున్నారని తెలిపారు. అర్హత గల పట్టభద్రులంతా గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై విస్త్రృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

