కరెంట్ కష్టాలు.. థర్మల్ ప్లాంట్లలో యూనిట్ల షట్‌డౌన్
రాష్ట్రంలో కరెంటు కష్టాలు రోజురోజు రోజుకూ అధికమవుంటే థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు వరుసగా షట్‌డౌన్ అవుతున్నాయి. తాజాగా మూడు యూనిట్లు బంద్ అయ్యాయి.
- వైటీపీఎస్‌లో 2, బీటీపీఎస్‌లో 1 పడక
- 1,870 మెగావాట్ల ఉత్పత్తి బంద్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరెంటు కష్టాలు రోజురోజు రోజుకూ అధికమవుంటే థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు వరుసగా షట్‌డౌన్ అవుతున్నాయి. తాజాగా మూడు యూనిట్లు బంద్ అయ్యాయి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో 2 యూనిట్లు, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో మరో యూనిట్ పడకేయడంతో 1,870 మెగావాట్ల విద్యు త్తు అందకుండా పోయింది. వైటీపీఎస్‌లోని యూనిట్-3, యూనిట్-4 షట్‌డౌన్ కావడంతో ఈ ఒక్క ప్లాంట్‌లోనే 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
బీటీపీఎస్‌లోని యూనిట్-1 బంద్ కావడంతో 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది. ఇప్పటికే బీటీపీఎస్‌లోని యూనిట్-3 సెప్టెంబర్ 9 నుంచి నడవటం లేదు. అక్టోబర్ 27న జెన్కో ప్లాంట్లలో 114 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పత్తి అక్టోబర్ 29కి వచ్చే సరికి 99.89 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. అంటే 15 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

