ఆహార తయారీ యూనిట్లపై టీజీ సేఫ్ దాడులు
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టీజీ సేఫ్) ఆహార భద్రత విభాగం రాష్ట్రంలోని ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
- యూనిట్ల లైసెన్సులు రద్దు 5,555 కిలోల ఆహార పదార్థాలు సీజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టీజీ సేఫ్) ఆహార భద్రత విభాగం రాష్ట్రంలోని ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 29న నిర్వహించిన తనిఖీల్లో పలు సంస్థల్లో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మసాలా దినుసులు, నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, పానీయాలు తదితరాలను తయారు చేసే మొత్తం 20 ఆహార తయారీ యూనిట్లను తనిఖీ చేసిన అధికారులు 9 సంస్థల ఫుడ్ సేఫ్టీ లైసెన్సులను సస్పెండ్ చేశారు.
వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా పలు సంస్థల్లో తయారీ యంత్రాలు తుప్పుపట్టి, అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తయారీ, నిల్వ ప్రాంతాల్లో అపరిశుభ్రత, ఆహార వ్యర్థాలు, బొద్దింకలు ఉన్నాయి. 21 ఆహార నమూనాలను అధికారులు సేకరించి అధికారులు రూ. 5.89 లక్షల విలువ చేసే 5,555 కిలోల ఆహార పదార్థాలను సీజ్, ధ్వంసం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

