వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్
వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో వాతావరణం పరంగా ఒడిదుడుకులను తట్టుకునేందుకు గేమ్‌చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్ ఉండనున్నదని పర్యావరణ నిపుణులు చెప్పారు.
- పర్యావరణ నిపుణుల వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో వాతావరణం పరంగా ఒడిదుడుకులను తట్టుకునేందుకు గేమ్‌చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్ ఉండనున్నదని పర్యావరణ నిపుణులు చెప్పారు. గ్రామీణ యువతకు భవిష్యత్తులో ఈ రంగం ప్రధాన ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అభిప్రాయపడ్డారు. క్లైమేట్ ఇంటెలిజెన్స్ రివల్యూషన్, అగ్రిబిజినెస్‌పై హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో రెండు రోజుల జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఎల్ నినో, తుపాన్ వంటి విపత్తులను దీటుగా ఎదురొనేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని సూచించారు. డిజిటల్ క్రాప్ డాటాబేస్‌లో రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతుల సమాచారం ఉన్నదని, కేంద్ర పథకాలు, పంట రుణాలు, వాతావరణ సమాచారం చేరవేత వంటి అంశాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు వాతావరణ సలహాలు ఇవ్వగలిగే స్థాయికి చేరడం అభినందనీయమని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని అగ్రి బిజినెస్ మాడల్‌కు ఆపాదించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

