IND vs BAN : ఆసియా కప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(60 నాటౌట్) తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌పై అర్ధశతకంతో చెలరేగిన అతడు ఈసారి బంగ్లాదేశ్ బౌలర్లను ఆడుకున్నాడు. సైఫుద్దీన్ ఓవర్లో నాలుగు ఫోర్లతో రెచ్చిపోయిన అభి.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో.. టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
అయితే.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన శుభ్‌మన్ గిల్ (29).. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన శివం దూబే(2)లు త్వరగా ఔటయ్యారు. దాంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(3 నాటౌట్)తో జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో పడ్డాడీ యంగ్‌స్టర్. పది ఓవర్లకు భారత్ స్కోర్.. 96/2.
Gill falls soon after, it’s Shivam Dube at No.3! https://t.co/5YqHggGq7Z
— ESPNcricinfo (@ESPNcricinfo) September 24, 2025
టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను బంగ్లా ఆదిలో కట్టడి చేసింది. తొలి మూడు ఓవర్లలో స్కోర్ 17 మాత్రమే. అయితే.. ఆ తర్వాత గేర్ మార్చిన శుభ్‌మన్ గిల్ (29) నసుం ఓవర్లో వరుసగా 4, 6 బాది ఊపు తెచ్చాడు. అంతే.. ఆ తర్వాత అభిషేక్ రెచ్చిపోయాడు. సైఫుద్దీన్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలతో చెలరేగిపోయాడు. దాంతో.. భారత్ ఆరు ఓవర్లలో 72 పరుగులతో ఆసియా కప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.