హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ 20 లీగ్‌లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న హైదరాబాద్ చాంపియన్స్ వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. బుధవారం ఆ జట్టు.. వరంగల్ వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. బంతితో వరంగల్‌ను 173/9కే నియంత్రించిన హైదరాబాద్.. ఛేదనను 15.3 ఓవర్లలోనే దంచేసింది.
అభిరథ్ (43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకానికి తోడు గణేశ్ (50) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మరో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్.. నల్లగొండపై 34 రన్స్ తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఖమ్మం నిర్ణీత ఓవర్లలో 211/2 స్కోరు చేయగా ఛేదనలో నల్లగొండ.. 177/8 వద్దే ఆగిపోయింది.