Abhinav Bindra | గోల్డెన్ షూటర్‌కు అరుదైన గౌరవం.. ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్న బింద్రా
Abhinav Bindra : ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన షూటర్ అభినవ్ బింద్రా (Abhinav Bindra)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్యారిస్ విశ్వక్రీడ(Paris Olympics 2024)ల్లో బింద్రా భారత టార్చ్ బేరర్‌గా..
Abhinav Bindra : ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన షూటర్ అభినవ్ బింద్రా(Abhinav Bindra)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్యారిస్ విశ్వక్రీడ(Paris Olympics 2024)ల్లో బింద్రా భారత టార్చ్ బేరర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ACOITC) సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. ఈ గౌరవం దక్కడంతో ఈ మాజీ షూటర్ పట్టలేనంత సంతోషంలో ఉన్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా ఎంపికైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒలింపిక్ జ్యోతి శాంతి, పట్టుదలకు ప్రతీక. ఈ కాగడ మనందరి ఐక్యతను, కలలకు ప్రతిరూపం. ఈ గౌరవం నిజంగా చాలా గొప్పది అని బింద్రా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
Excited to share that I’ll be a torch bearer for the @paris2024 Olympic Games , a beacon of peace and perseverance across the globe. This flame represents our collective spirit and the power of dreams. A great privilege and honour! #OlympicTorch #Paris2024 #wecarrytheflame 🔥 pic.twitter.com/kizpgHXlzP
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) February 1, 2024
ఒలింపిక్ జ్యోతిని గ్రీస్‌లోని ఒలింపియాలో మొదట వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ దేశంలో ప్రదర్శన ముగిశాక ఆ జ్యోతిని సముద్ర మార్గం గుండా పెద్ద ఓడలో ఫ్రాన్స్‌కు తరలిస్తారు.ఏప్రిల్ 16 నుంచి జూలై 26 వరకు ఒలింపిక్ టార్చ్ రీలే జరుగనుంది. ఈ రీలేలో బింద్రా ఒలింపిక్ కాగడను వెలిగించనున్నాడు. 68 రోజుల పాటు జరిగే ఈ రీలే వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.
అభినవ్ బింద్రా

బీజింగ్‌లో 2018లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటర్ బింద్రా చరిత్ర సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెలాడించాడు. వెండి పతకంతో రాజ్యవర్ధర్ సింగ్ రాథోడ్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. జూలై 26వ తేదీన ప్యారిస్‌లో ఒలింపిక్స్ షురూ కానున్నాయి. ఆగస్ట్ 11వ తేదీన ఈ మెగా టోర్నీ ముగియనుంది.
ఇవి కూడా చదవండి
- Harish Rao | ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు
- Cancer Cases: ఇండియాలో కొత్తగా 14 లక్షల క్యాన్సర్ కేసులు: డబ్ల్యూహెచ్‌వో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

