Cancer Cases: ఇండియాలో కొత్తగా 14 లక్షల క్యాన్సర్ కేసులు: డబ్ల్యూహెచ్వో
Cancer Cases: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ డేటాను రిలీజ్ చేసింది. ఆ సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ ఆ వివరాలను ప్రకటించింది. 115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును విడుదల చేశారు. అయితే 2022లో ఇండియాలో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయినట్లు ఆ నివేదికలో చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్లో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది ఆ వ్యాధి వల్ల మరణించారు. ఎక్కువ శాతం భారతీయుల్లో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పెదవు, నోరు, ఊపిరితిత్తులు క్యాన్సర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో ఉన్నాయి. నోటి క్యానర్స్ 15.6 శాతం, శ్వాసకోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు ఉన్నాయి. ఇక మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
Ahead of #WorldCancerDay on Sunday, here are the latest global cancer burden stats (2022)
🌍 Estimated 9.7M deaths
💔 1 in 9 men & 1 in 12 women lose their lives to the disease
👤 1 in 5 people face cancer in their lifetimehttps://t.co/gOW4eAZ1c1#CloseTheCareGap— World Health Organization (WHO) (@WHO) February 1, 2024
రొమ్ము క్యాన్సర్ 27 శాతం, 18 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ డబ్ల్యూహెచ్ క్యాన్సర్ ఏజెన్సీగా పనిచేస్తోంది. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన అయిదేళ్ల తర్వాత కూడా ఇండియాలో ప్రాణాలతో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉన్నట్లు ఆ రిపోర్టులో తేల్చారు. అయిదుగురిలో ఒకరి క్యాన్సర్ వస్తుందని, 9 మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్తో మరణిస్తున్నారు.
115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును డబ్ల్యూహెచ్వో రిలీజ్ చేసింది. కేవలం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్ను గుర్తించారు. 97 లక్షల మంది ఆ వ్యాధి వల్ల మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

