బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 30, 2020 , 18:24:17

డివిలియర్స్‌ మ్యూజిక్‌ వీడియోలో కోహ్లీ, చాహల్‌

డివిలియర్స్‌  మ్యూజిక్‌ వీడియోలో  కోహ్లీ, చాహల్‌

దుబాయ్:‌  సౌతాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ కొత్త మ్యూజిక్‌ వీడియోను ఆవిష్కరించాడు. సింగర్‌, గేయరచయిత కరెన్‌ జాయిడ్‌, ఎంన్డిలోవ్‌ యూత్‌ కోయిర్‌ల సహకారంతో 'ది ప్లేమ్'‌ పేరుతో  ఏబీడీ కొత్త వీడియోను  రూపొందించాడు. విపత్కర పరిస్థితుల్లో  దక్షిణాఫ్రికా దేశ ప్రజల్లో స్ఫూర్తినింపేందుకు ఈ వినూత్న ప్రయోగానికి  శ్రీకారం చుట్టాడు.

సాంగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డేల్‌ స్టెయిన్‌, క్రిస్‌ మోరీస్‌, రబాడ, చాహల్‌, నోర్ట్జే తదితరులు ఉన్నారు.  2010లోనే ద్విభాషల్లో డివిలియర్స్‌ మ్యూజిక్‌ ఆల్బబ్‌ను తీసుకొచ్చాడు. అందులో ఏబీడీ పాటలు  కూడా పాటాడు.