Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోన్ మెస్సీ(Lionel Messi)కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలామందే. అతను ఏ దేశంలో ఆడినా సరే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. మెస్సీ.. మెస్సీ.. అంటూ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అర్జెంటీనా(Arjentina), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య నిన్న రాత్రి బీజింగ్ స్టేడియం(Beijing Stadium)లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌కు మెస్సీ వీరాభిమాని అంతరాయం కలిగించాడు. భద్రతా వలయాన్ని దాటి, మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి మెస్సీని హత్తుకున్నాడు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ కుర్రాడు వాళ్లకు చిక్కలేదు. కాసేపటికి ఎలాగోలా ఆ యంగ్‌స్టర్‌ను పట్టుకున్నసిబ్బంది ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
Last night, in China.
A Messi fan successfully broke through the defense line.
He is so young that he runs fast enough. Finally, he returned to the stage to continue watching the game. pic.twitter.com/obgmWpfnGL— Sharing Travel (@TripInChina) June 16, 2023
మ్యాచ్ 61వ నిమిషంలో మెస్సీ కార్నర్ వద్ద ఉన్నాడు. ఆ సమయంలో కానీ, మెస్సీ జెర్సీ ధరించిన ఒక కుర్రాడు వేగంగా పరుగెత్తుకొచ్చి మెస్సీని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా గోల్ పోస్ట్ వైపు వేగంగా వెళ్లాడు. అతడి వెంట భద్రతా సిబ్బంది పరుగులు పెట్టారు. గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్(Emiliano Martinez)కు హైఫై చెప్పి సదరు అభిమాని అంతే వేగంగా ముందుకెళ్లాడు. అయితే.. ఎట్టకేలకు గ్రౌండ్ సిబ్బంది అతడిని పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే గోల్ కొట్టాడు. ఈ స్టార్ ఆటగాడు మెరుపు వేగంతో గోల్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.
వచ్చే సీజన్లో మెస్సీ కొత్త జెర్సీతో కనిపించనున్నాడు. గత రెండేళ్లుగా పీఎస్జీ(PSG)కి ఆడిన ఈ వరల్డ్ కప్ హీరో ఆ క్లబ్‌కు ఈమధ్యే గుడ్ బై చెప్పేశాడు. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్(Inter Miami)తో మెస్సీ ఒప్పందం చేసుకున్నాడు. దాంతో, సౌదీ అరేబియాకు చెందిన అల్ – హిలాల్ లేదా బార్సిలోనా క్లబ్‌కు ఆడతాడనే వార్తలకు తెరదించాడు. మరి.. కొత్త సీజన్లో, కొత్త జెర్సీతో మెస్సీ ఎలా రాణిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.