Womens Cricket Team | జూలైలో బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు.. 11ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
Womens Cricket Team : మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League 2023)లో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Cricket Team) వచ్చే నెల(జూలై)లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. టీమిండియా టూర్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) మహిళా....
Womens Cricket Team : మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League 2023)లో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. అవును.. భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Cricket Team) వచ్చే నెల(జూలై)లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సిరీస్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీమిండియా టూర్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) మహిళా విభాగం అధ్యక్షురాలు షఫియుల్ అలమ్ చౌధురి నదెల్(Shafiul Alam Chowdhury Nadel) వెల్లడించింది.
‘అవును.. మా జట్టు భారత మహిళ జట్టుతో జూలైలో వన్డే సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్లు షేర్-ఇ-బంగ్లా నేషనల్ స్టేడియంలోనే జరగనున్నాయి’ అని షఫియుల్ వెల్లడించింది. అంతేకాదు భారత పర్యటన షెడ్యూల్ను ఎస్బీఎన్ఎస్ ఇప్పటికే విడుదల చేసింది. భారత జట్టు జూలై 9వ తేదీన ఢాకాకు చేరుకోనుంది.
11 ఏళ్ల తర్వాత..
బంగ్లాదేశ్ గడ్డపై మహిళా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 2012లో బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో తలపడింది. దాంతో, భారత్, బంగ్లా సిరీస్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 9న జరిగే తొలి టీ20లో బంగ్లా, భారత మహిళల జట్లు తలపడతాయి. రెండో టీ20 జూలై 11న, మూడో టీ20 జూలై 13 ఉన్నాయి. ఆ తర్వాత మూడు రోజుల విరామం తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే జూలై 16న జరగనుంది. రెండో వన్డే 19న, 22న మూడో వన్డే మ్యాచ్లు నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
MS Dhoni | బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో..!
Brij Bhushan | బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు కేంద్రం యత్నం.. పోక్సో కేసు ఎత్తేయాలని కోర్టును కోరిన ఢిల్లీ పోలీసులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

