Tejavath Sukanya | కురవి, అక్టోబర్ 6: దక్షిణాఫ్రికాలోని సన్‌సిటీ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో భారత యువ లిఫ్టర్ తేజావత్ సుకన్య రజత పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 76కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య లిఫ్ట్‌లో 107.5కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
ఇదే కేటగిరీలో పోటీపడ్డ భారత్‌కు చెందిన వైశాలి(112.5కి), బెల్ ఎలెనా(100కి, ఐర్లాండ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మాహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కలెక్టర్ తండాకు చెందిన సుకన్య నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ తనకు ఆర్థికంగా అండగా నిలిచిన గ్రీన్కో గ్రూపు సీఎండీ అనిల్‌కుమార్‌కు రుణపడి ఉంటానని పేర్కొంది.