కోహ్లీ పబ్‌పై కేసు
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్ నడుపడంపై బెంగళూరు పోలీసులు చర్యలకు దిగారు.
బెంగళూరు: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్ నడుపడంపై బెంగళూరు పోలీసులు చర్యలకు దిగారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర్లో ఉన్న కోహ్లీ పబ్ ‘వన్8 కమ్యూన్’ నిర్వాహకులపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నగరంలో అర్ధరాత్రి 1 వరకు అనుమతి ఉన్నా..ఎక్కువసేపు పబ్ తెరిచి ఉంచిన కారణంగా చర్యలు తీసుకున్నామని సెంట్రల్ డీసీపీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘అర్ధరాత్రి సమయంలో పబ్ నుంచి విపరీతమైన సౌండ్లు వస్తున్నాయన్న ఫిర్యాదు మేరకు చర్యలకు దిగాం. దర్యాప్తు కొనసాగుతున్నది. తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. స్టార్ క్రికెటర్‌గా వెలుగొందుతున్న కోహ్లీ..ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, బెంగళూరులో పబ్‌లు నిర్వహిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

