ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో పదివేల మార్కుకు అడుగు దూరంలో నిలిచాడు. భారత్‌తో సిడ్నీ టెస్టులో పదివేల పరుగులు పూర్తి చేస్తాడనుకున్న స్మిత్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటై 9,999 పరుగుల వద్ద ఆగిపోయాడు. దీంతో జయవర్దనే(శ్రీలంక) తర్వాత ఇలా ఔటైన రెండో బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. శ్రీలంకతో గాలె వేదికగా ఈనెలాఖరులో జరిగే మ్యాచ్ వరకు స్మిత్ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా తరఫున అలెన్బోర్డర్, స్టీవ్‌వా, రికీ పాంటింగ్ తర్వాత టెస్టుల్లో 10వేల మైలురాయిని చేరుకోనున్న నాలుగో బ్యాటర్‌గా స్మిత్ నిలిచే అవకాశముంది. స్మిత్ ప్రస్తుతం 114 మ్యాచ్‌ల్లో 55.9 సగటుతో 9,999 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. ఇందులో 34 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి.