న్యూఢిల్లీ: రోహ్తక్ వేదికగా శుక్రవారం నుంచి 6వ జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 640 మందికి పైగా బాక్సర్లు టోర్నీలో పోటీపడే అవకాశముంది. మొత్తం 13 విభాగాల్లో బాలురు, బాలికలు బరిలోకి దిగనున్నారు.
బాలుర కేటగిరీలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, బాలికల విభాగంలో హర్యానా డిఫెండింగ్ చాంపియన్లుగా తమ టైటిళ్లను నిలబెట్టుకునేందుకు పట్టుదలతో ఉన్నాయి. జాతీయ టోర్నీ ద్వారా ప్రతిభ కల్గిన బాక్సర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్‌సింగ్ పేర్కొన్నాడు.