హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా 7వ తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ బుధవారం మొదలైంది. ఇందులో ఆతిథ్య హైదరాబాద్ సహా మహబూబ్‌నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయి.
యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో జూనియర్, సబ్‌జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. బాలికల కేటగిరీలో దేశంలో టాప ర్యాంక్‌ల్లో కొనసాగుతున్న దీక్షిత కొమురవెల్లి, లాహిరి కొమురవెల్లితో పాటు బన్నీ(5 ర్యాంక్), మహమ్మద్ రిజ్వాన్(8 ర్యాంక్) బరిలోకి దిగుతున్నారు.